టంగుటూరు లో జగన్ ఎందుకు కావాలి అంటే కార్యక్రమం
నందలూరు మండలం టంగుటూరు గ్రామ పంచాయతీ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలి అంటే అనే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైనది. కరపత్రంలో చేసిన దిశా నిర్దేశం అనుసరించి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. టంగుటూరు గ్రామ పంచాయతీకి వివిధ కార్యక్రమాల ద్వారా సుమారు 25 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమము ఇ. ఓ. పి.ఆర్.డి. సతీష్ , ఎంపీడీవో సౌభాగ్యం ఆధ్వర్యంలో డిస్ప్లే బోర్డు ఆవిష్కరణ జరిగినది. తదనంతరం వైఎస్ఆర్సిపి పార్టీ జెండా టంగుటూరులోని బస్టాండ్ కూడలిలో YSRCP పార్టీ శ్రేణుల కార్యకర్తల ఆధ్వర్యంలో ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి ఎగురవేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గడికోట ఉషా వెంకటసుబ్బారెడ్డి, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనరసయ్య, పార్టీ మండల ప్రెసిడెంట్ అన్నెం నాగేంద్రమూర్తి, వక్స్ బోర్డ్ సెక్రటరీ సయ్యద్ అమీర్, జెసిఎస్ కన్వీనర్ కరిముల్లా ఖాన్ , వరహరి షావలి, మస్తాన్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
Comentários