--మళ్లీ జగనన్న ఎందుకు సీఎం కావాలి.. కార్యక్రమంలో.
చెవ్వు శ్రీనివాసులు రెడ్డి,ఎల్వి మోహన్ రెడ్డి.
పాదయాత్రలో ప్రజలు తెలిపిన కష్టాలకు అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టో రూపొందించి; ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కే చెల్లుతుందని వైసీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి లు అన్నారు.
గురువారం మండల పరిధిలోని రాజుకుంట గ్రామంలో జగనన్నే మళ్లీ సీఎం ఎందుకు కావాలన్న కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇరువురు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామస్థాయిలో సచివాలయ వ్యవస్థకు నాంది పలికి ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలను వాలంటరీలచే అందిస్తూ అవ్వ తాత మోములో చిరునవ్వు, అక్క చెల్లెమ్మలకు భరోసా, విద్యా కానుకచే చదువుకు పెద్దపీట ఇలా అన్ని వర్గాల వారికి మేలు చేకూరుస్తూ పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను కోరారు.
గడిచిన నాలుగన్నర సంవత్సరాల కాలంలో రాజుకుంట సచివాలయ పరిధిలో 894 మందికి 16 కోట్ల 9 లక్షల 65 వేల రూపాయలు లబ్ధి చేకూరిందని అన్నారు. వైసిపి పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు. ఇంటింటికి వెళ్లి చేకూరిన లబ్ధిని వివరించేందుకు రసీదు బుక్కులను వాలంటరీలకు అందించారు.
ఈ కార్యక్రమంలో మండల డిసిసి బ్యాంక్ చైర్మన్ ప్రదీప్ రెడ్డి ,బి.రమణారెడ్డి, రాష్ట్ర కనీస వేతన సవరణ చట్టం అడ్వైజరీ బోర్డు మెంబర్.మలిశెట్టి. వెంకటరమణ,లింగం లక్ష్మీకర్, స్థానిక వైసిపి నాయకులు మాదినేని కనకరాజు,లోకేష్,,నారాయణ, శ్రీనివాసులు,వి.సుబ్బరాయుడు, మల్లి,సర్పంచ్ లు ఈశ్వరయ్య, ప్రభాకర్,ఎంపిడిఓ.శివరామిరెడ్డి,ఈఓపిఆర్డీ.శివకుమార్,భూతుకన్వీనర్లు,వాలంటీర్లు,గృహసారధులు,సంక్షేమకన్వీనర్లు,గ్రామప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comentários