అడవి జంతువుల 'రోధన'
వేటగాళ్లతో కుమ్మక్కైన ఎఫ్ఆర్ఓ
తిరుపతి జిల్లా, యార్రవారి పాలెం
దుప్పిని వేటాడిన నిందితులపై కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్న అటవీశాఖ సిబ్బంది, అటవీ శాఖ అధికారుల తీరుపై సర్వం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల వివరాల మేరకు... మండలంలోని విఆర్ అగ్రహారం పంచాయతీలోని పంట పొలాల సమీపంలో అటవీ ప్రాంతం నుంచి వచ్చి నీటి కొలనులో చిక్కుకుంది. దుప్పిని గమనించిన సాయిబులపల్లి, వి.ఆర్ అగ్రహారానికి చెందిన కొంతమంది దుప్పిన వేటాడి మంగళవారం రాత్రి మాంసాన్ని వండుకుని జల్సా చేసుకున్నారు.
కొంతమంది భాకరాపేట ఎఫ్ ఆర్ కు సమాచారం అందించారు. అయితే నామమాత్రంగా వచ్చి తనిఖీలుచేసి వేటగాళ్లతో కుమ్మక్కయ్యారు. అటవీ జంతువులు ఆహారంగా మారిపోతున్నా అటవీ శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుప్పిని వేటాడి చంపిన వారిపై కేసు నమోదు చేయాలి. లేనిపక్షంలో డిఎఫ్ఓకు ఫిర్యాదు చేస్తామని స్థానికులు తెలిపారు.
Comments