తూర్పు గోదావరి జిల్లా, బెండమూర్లంక రెవెన్యూ గ్రామ పరిధిలో మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం. గత కొంత కాలంగా కొనసాగుతున్న భూ వివాదంలో సర్వే కి వచ్చిన అధికారులను అడ్డుకునే ప్రయత్నం. ఇంతలోనే ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న కొటికలపూడి ప్రసన్న, కొటికలపూడి ప్రసన్న భర్త కొటికలపూడి పాండురంగారావుకు అతని ఐదుగురు అన్నదమ్ములకు మధ్య కొనసాగుతున్న భూవివాదం, 15 ఏళ్ల క్రితం తుమ్మల పల్లి గ్రామ పరిధిలోకి వచ్చే బెండమూర్లంక రెవెన్యూ గ్రామ పరిధిలో ఆకివీడు కి చెందిన ఆరుగురు అన్నదమ్ములు 18 ఎకరాలు కొనుగోలు. ఎవరికి వారు వేర్వేరుగా రెండున్నర ఎకరాల చొప్పున రిజిస్టర్ చేయించుకున్న అన్నదమ్ములు. గత కొంత కాలంగా కొటికలపూడి పాండురంగారావు ఈ భూములన్నీ చూసుకుంటుండగా తమ భూములు తమకు అప్పగించాలని మిగిలిన అన్నదమ్ములు అడుగుతున్నట్లు సమాచారం, భూ సర్వే నిర్వహించి తమ భూములు తమకు అప్పగించాలని రెవెన్యూ అధికారులు ఆశ్రయించిన మిగిలిన ఐదుగురు అన్నదమ్ములు, ఇప్పటికే రెండు సార్లు సర్వే నోటీసులు జారీ చేసినా స్వీకరించక పోవడంతో మూడోసారి నేరుగా కొలిచేందుకు ప్రయత్నం. ఈ నేపథ్యంలోనే అడ్డుకున్న పాండురంగారావు అతని భార్య, నెల రోజుల క్రితం దాడి కేసు లో వైరల్ అయిన వీడియోలో దాడి చేసిన గుర్రం రాజీవ్ పాండురంగారావు కు స్వయానా మేనల్లుడు ( పాండురంగారావు సోదరుడి అల్లుడు), ఉన్నపాటుగా ఒంటి పై పెట్రోల్ పోసి నిప్పంటించు కోవడంతో చెలరేగిన మంటలు, ఒంటికి నిప్పు పెట్టుకున్న ప్రసన్న ను పక్కనే ఉన్న పంట బొదె లోకి ఆమె భర్త త్రోసివేయడం తో తప్పిన ప్రాణాపాయం, గాయపడిన మహిళ ప్రసన్న ను ఆసుపత్రికి తరలింపు.
top of page
bottom of page
Comments