పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వందనపు సాయిబాలపద్మ కి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహనరెడ్డి మరోసారి ఆర్యవైశ్యులకు అత్యున్నత గౌరవం ఇచ్చారు. ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రీజనల్ చైర్మన్ గా ఆర్యవైశ్య మహిళ వందనపు సాయిబాలపద్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలను కలుపుకుని ఈ మూడు జిల్లాలకు ఈ పదవిని సమర్ధవంతమైన వారికి అప్పగించాలని భావించి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వందనపు సాయిబాలపద్మ ని ఎన్నిక చేసారు.
ఈ సందర్భంగా వందనపు సాయిబాలపద్మ మాట్లాడుతూ. ఈ పదవి నిర్వహణకు పూర్తి బాధ్యతగా కృషి చేస్తానన్నారు.ఇప్పటికే ఏలూరు వైయస్ ఆర్ పార్లమెంటరీ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పని చేస్తున్నానని, పార్టీ కార్యక్రమాల పట్ల అంకితభావంతో పని చేయటం గుర్తించి తనకు కృష్ణా, పశ్చిమ,తూర్పు గోదావరి(3 జిల్లాలకు) సంబంధించిన ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అండ్ రీజనల్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారని,ఇది ఆర్యవైశ్యలకు లభించిన మరొక గుర్తింపు అని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ కి, తితిదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, చింతలపూడి శాసన సభ్యులు ఉన్నమట్ల ఎలీజా, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. శ్రీమతి వందనపు సాయిబాలపద్మకు పలువురు అభినందనలు తెలియచేసారు.
Comments