ఎయిడ్స్ రహిత సమాజాన్ని స్థాపిద్దాం - ప్రిన్సిపాల్ పురుషోత్తం
రాజంపేట, ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఎయిడ్స్ రహిత సమాజాన్ని స్థాపించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.పురుషోత్తం పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా డిశంబరు 1 వ తేదీ గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాజంపేట పట్టణం లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముందు కళాశాల ఆవరణలో సమీకరణమైన విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ డాక్టర్ బి.పురుషోత్తమ్ మాట్లాడుతూ విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు మరియు అధ్యాపక సిబ్బంది ఎయిడ్స్ నిర్మూలనకు పాటు పడాలని రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. రామకృష్ణ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం సుమారు 500 మంది విద్యార్థులచే రాజంపేట పట్టణంలో ప్రజలకు ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కళాశాల రెడ్ రిబ్బన్ క్లబ్ కో ఆర్డినేటర్ డాక్టర్ బి.రామకృష్ణ, యన్.సి.సి.కో ఆర్డినేటర్ సి.విజయ భాస్కర్, యన్.యస్. యస్. కో ఆర్డినేటర్ డాక్టర్ యల్. రాజ మోహన్ రెడ్డి మరియు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన సి. నరసింహ రాజు, చైతన్య కుమార్, ఐ.సి.డి.సి.కౌన్సిలర్ వెంకట సుబ్బయ్య మరియు సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
Comentários