పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - కౌన్సిలర్ ఇర్ఫాన్
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు అటవీ శాఖ అధికారులు రాజీవ్ గాంధీ ఏకో పార్క్ నందు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ కు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొద్దుటూరు మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు భావి భారత భవిష్యత్తుకు ఆయువు అని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెట్లను పెంచడం ద్వారా వేసవికాలంలో భూతాపాన్ని తగ్గించి వర్షాలు సకాలంలో కురిసేలా చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అడవులు సహజ సంపద అని వాటిని పరిరక్షించి రాబోవు తరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నందు పలువురు విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆయన తిలకించారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు అటవీ శాఖ అధికారులు, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
Great