వ్యక్తిగత పరిశుభ్రత తోనే జీవ సంబంధ వ్యాధులు దూరం. డాక్టర్ కేడి వరప్రసాద్.
---ప్రపంచ జూనోసిస్ దినోత్సవ నిర్వహణ.
---పలు జీవవ్యాధులపై అవగాహన
---పశుసంబంధ సహాయానికై 1962 కి ఫోన్ చేయాలని పేర్కొన్న వైద్యులు.
జూలై 6 వ తేదీన "ప్రపంచ జూనోసిస్ దినోత్సవం" సందర్భంగా.. ఈరోజు అన్నమయ్య జిల్లా చిట్వేల్ ప్రాంతీయ పశు వైద్యాశాల నందు డా. కె డి వరప్రసాద్, సహాయ సంచాలకుల వారి అధ్యక్షతన డా. భువనేశ్వరి , డా. భాగ్యవతి మరియు డా. వేదవతి ల నిర్వహణలో మండల పశు వైద్య సిబ్బంది మరియు గోపాలమిత్రల సహకారం తో టీకాల కార్యక్రమం మరియు అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కేడి వరప్రసాద్ మాట్లాడుతూ " లూయిస్ పాశ్చర్" అనే ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త 1885 లో జూనోటిక్ వ్యాధి రాబిస్‌కు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా వ్యాధి నిరోధక టీకాలను కనిపెట్టి ఎందరో ప్రాణాలను నిలిపిన ఈ తేదీని గుర్తుచేసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ప్రపంచ జూనోసెస్ దినోత్సవాన్ని నిర్వహిస్తుందని ఈ టీకా మానవ చరిత్రలో ఒక పెద్ద పురోగతి అని అన్నారు.
ప్రజలను ప్రభావితం చేసే ప్రతి 10 అంటు వ్యాధులలో 6 కంటే ఎక్కువ జంతువుల నుండి సంక్రమించ వచ్చని అంచనా వేయబడిందనీ;జూనోసెస్‌లో ఉదాహరణకు, తీవ్రమైన సమకాలీన వ్యాధులు సాల్మొనెలోసిస్ మరియు ఎబోలా వైరస్ వ్యాదులున్నాయనీ గణనీయమైన సంఖ్యలో జూనోటిక్ అనారోగ్యాలు ప్రజలపై ప్రభావం చూపుతున్నాయనీ కోవిడ్-19 మహమ్మారి ఇటీవలి ఉదాహరణ అని అన్నారు.మనిషి రోజువారీ ప్రవర్తన లో మార్పు మాత్రమే మానవ జనాభాకు భవిష్యత్తులో జూనోస్‌ల ప్రమాదాలను తగ్గిస్తుందనీ అన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత వల్ల వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చని కాకర్లవారిపల్లి డా.వేదవతి , డా. భాగ్యవతి లు తెలిపారు. చిట్వేలికి 100 డోసుల రాబీస్ నివారణ టీకాలు మంజూరు అయినట్లు డా.భువన తెలిపారు. ఎవరికి ఏ సమస్య వచ్చిన పశు సంవర్ధక శాఖ సహాయ నెంబరు 1962 కు ఫోన్ చెయ్యాలని మరియు పశు ఆరోగ్య పరి రక్షణలో పశు సంవర్థక శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో వుంటుందని డా. కేడీ ప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా అత్తిరాల నుండి కాకర్ల వారి పల్లి కి బదిలీ అయిన డా.వేదవతిని,కాకర్ల వారి పల్లి నుండి అత్తిరాలకు బదిలీ అయిన భాగ్యవతి లను కె డి వరప్రసాద్,సిబ్బంది సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పశువైద్యులు,పశువైద్య సిబ్బంది, గోపాలమిత్రలు, క్రిమిలైన్ డైరీ ఉద్యోగి పవన్ తదితరులు పాల్గొన్నారు.
Comments