ప్రపంచంలో అత్యంత పెద్ద గోల్డ్ ఫిష్ లభ్యం
మనము చేపల వేటకు వెళ్ళినప్పుడు మనకు దొరికిన కొద్ది చేపల తోటే ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందుతాము. ఫ్రాన్స్ లోని శాంపియన్ లోని బ్లూ వాటర్ నదిలో ఆండీ హాకెట్ అనే వ్యక్తి వల విసిరి చేపలు పట్టే క్రమంలో ప్రపంచంలోని అతి పెద్ద గోల్డ్ ఫిష్ అతనికి లభించింది. దాని వయసు దాదాపుగా 20 సంవత్సరములు మరియు దాని బరువు 30 కేజీలు. అది ఆడ చేప అని తెలియ వచ్చింది. దాని విలువ మార్కెట్ లో కోట్ల రూపాయలు పలుకుతుంది అని పరిశీలకులు తెలియజేశారు. అంత విలువైన చేపను అతను అమ్ముకోవచ్చు కోట్ల రూపాయలు సాధించవచ్చు. కానీ అరుదైన చేప జీవించాలి అనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా. ఒక అర్ధ గంట తర్వాత తిరిగి నదిలోనే ఆ చేపను వదిలాడు ఆ మహానుభావుడు.
ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతూ ఉన్నది. అన్ని దేశాలకు సంబంధించిన మీడియా మరియు న్యూస్ చానల్స్ లో ప్రసారం జరుగుతూ ఉన్నది. మనము కూడా కాస్త ఆలోచించుకోవాలి ప్రస్తుతము మన భారతదేశంలో అరుదైన జంతుజాలం పూర్తిగా అంతరించిపోయే స్థితిలో ఉన్నా కూడా మనము వెనక ముందు ఆలోచించుకోకుండా దొరికిందే తడువుగా వండుకొని తింటున్నాము లొట్టలేసుకుంటూ... ఉదాహరణకు ఉడుములు, అడవి కుందేలు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు. ఈ ప్రపంచంలో ప్రకృతిలో జీవించే అన్ని రకాల జీవరాశులు ఉంటేనే మానవ మనుగడ కొనసాగుతుంది. అవి లేని నాడు మానవులు సైతం ఉండరు ఈ భూమి మీద.
Comments