ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు వై. బాలనాగిరెడ్డి
ప్రసన్న ఆంధ్ర : మంత్రాలయం, నా కుటుంబం మొత్తం ప్రజా సేవకే అంకితమని, పార్టీకి కార్యకర్తలే ఊపిరి అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు వై.బాలనాగిరెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పెద్దాయన వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై.సీతారామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ప్లీనరీ కార్యక్రమానికి ఎంపీ సంజీవ్ కుమార్,ప్లీనరీ పరిశీలకులు చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా మాధవరం నుంచి మంత్రాలయం ఎస్.వి.బి అతిథి గృహంవరకు నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఎంపీ సంజీవ్ కుమార్,పరిశీలకులు చెరుకులపాడు ప్రదీప్ రెడ్డితో కలిసి రాఘవేంద్ర సర్కిల్ వరకు ఉరేగింపుగా వచ్చి రాఘవేంద్ర సర్కిల్ లో వైయస్సార్ విగ్రహానికి, గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత ఎంపీ సంజీవ్ కుమార్ చేతుల మీదుగా జెండావిష్కరణ చేశారు. అశేష జనవాహిని మధ్య కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్లీనరీ సభ దగ్గరకు చేరుకున్నారు.
ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్లీనరీ పరిశీలకులు చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ, రాంపురం రెడ్డిసోదరులకు ప్రజాభిమానం ఉందని,వారు చేసేసేవ కార్యక్రమాలే వారిని ఇంతటి స్థాయి తీసుకు వచ్చాయని కొనియాడారు. ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ కోసిగి,కుప్పగల్ ప్రజలకు వీలుగా ఉండే విధంగా రెండు రైళ్లు ఆపాలని నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రితో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మరో వైపు బాలనాగిరెడ్డి హ్యట్రిక్ సాధించడం అంటే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందని, మరో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉండాలని ఆకాంక్షించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బాలనాగిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే, జలవనరుల శాఖ మంత్రిగా చేసుకుంటే వెనుకబడిన మన జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని వివరించారు.
మా ప్రజలంతా మాస్ నేను మాస్ - వై. బాలనాగిరెడ్డి
వైఎస్సార్సీపి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు వై.బాలనాగిరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందని గొప్పగా చెప్పారు. ఈ మధ్యకాలంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ తిక్కారెడ్డి బాదుడే- బాదుడు కార్యక్రమంలో పాల్గొన్ని, కారం రేటు పెరిగిందా, ఉప్పు రేటు పెరిగిందా, డీజిల్, పెట్రోల్ రేటు పెరిగిందా అని వస్తున్నాడు కదా. నాది పుట్టుకతోనే రాజకీయ కుటుంబం అని తెదేపా నాయకులు చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నా లేదా ఆయనకు నేనే వద్దు అనుకుంటే నా కుమారులు ఇద్దరు సిద్ధంగా ఉన్నారని వారిపై గెలిచే దమ్ము, ధైర్యం ఉంటే బాబు తన కుమారుడు నారాలోకేష్ ని బరిలో దింపాలని సవాల్ విసిరారు. నేను 2009లో టీడీపీ నుంచి గెలిచిన మాట వాస్తవమే, కాకపోతే అప్పట్లో నాకు బీ ఫాం తప్పా ఏమి ఇవ్వలేదని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారిని కలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో పార్టీ మారడం జరిగింది. చంద్రబాబు నాయుడికి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకనే పవన్ కళ్యాణ్ తో పోత్తులకు పాకులాడుతున్నాడన్నారని, టీడీపీ హయాంలో నా నాయకులు, కార్యకర్తలపై కేసులు, రౌడీ షీట్ లు ఓపెన్ చేయించి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఒక్క మాట చెబితే తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకూడా తిరగలేరని హెచ్చరించారు.మా నాయకుడు, నేను, నా కుటుంబ సభ్యులు ఫ్యాక్షన్ వద్దు, గొడవలు వద్దు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు.
నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా ఎవ్వరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే అభివృద్ధి విషయంలో చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, మీరు మీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించే దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి నేను నా నాయకులు, కార్యకర్తలతో కలిసి వస్తా, నా కంటే మీ వైపు ఒక్క కార్యకర్త ఎక్కువ ఉన్న రాజకీయ సన్యాసం తీసుకుంటానని హామీ ఇచ్చారు. నా నియోజకవర్గం మాస్ నియోజకవర్గం అందుకే నా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు మాస్ గా ఉంటే నేను మాస్ గానే ఉంటానన్నారు. అభివృద్ధి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి నేరుగా బటన్ నొక్కి లబ్దిదారులకే పథకాలు అందించడం జరుగుతుందన్నారు. కాకపోతే నాయకులు, కార్యకర్తలకు ఏమి చేయలేకపోయాను. నేను వేదిక మీద నుంచే సియం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ని కోరేది ఏమిటంటే, పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలన్నారు. త్వరలోనే ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాకు ఆరోగ్యం బాగా లేదని ద్రుష్ప్రచారం చేసే వారికి ఒక్కటే మాట చెబుతున్నా, నా కాలు నొప్పి ఉన్న మాట వాస్తవమే, కాకపోతే నా ప్రజానీకాని చూస్తే నా కాళ్ళు నొప్పి ఏమి ఉండదని పేర్కొన్నారు. దేవుళ్ల దయ, ప్రజల దీవెనలతో నేను, నా కుటుంబసభ్యులు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటామన్నారు. పిలిచిన వెంటనే నాలుగు మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు,అభిమానులకు పేరు పేరున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమాన్నీ విజయవంతం చేయడానికి సహకరించిన పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి. భీమిరెడ్డి, వైఎస్సార్సీపీ మండల ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ కోసిగి మండల ఇన్ చార్జ్ మురళీ రెడ్డి, పీఎ వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ పట్టణ కార్యదర్శి అశోక్ రెడ్డి, జడ్పీటీసీ మజ్జిగ గోవిందమ్మ, మండల నాయకులు రాఘవేంద్ర రెడ్డి, రామకృష్ణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, మాలపల్లి గురురాజరావు, మాజీ జడ్పీటీసీ సభ్యులు లక్ష్మయ్య, తెల్లబండ్ల భీమయ్య, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, పెద్ద కడబూరు సర్పంచ్ రామాంజనేయులు, రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్ర రెడ్డి. గజేంద్ర రెడ్డి, ముక్కరన్న, ఎంపీపీ లవకుశ ఈరన్న, జడ్పీటీసీ పవిత్ర, కోసిగి మార్కెట్ యార్డు చైర్మన్ శరణమ్మ, మహాంతేష్ స్వామి, ఐరన్ గల్లు శ్రీనివాస్ రెడ్డి, నాడిగేని నరసింహులు, ఇల్లూరి ఆదినారాయణ శెట్టి, ఉరుకుందు ఈరన్న స్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు మాజీ ఛైర్మన్ దేశాయి క్రిష్ణ స్వామి, ఆత్రితనయ గౌడ్, నాగరాజు గౌడ్, కౌతాళం జడ్పీటీసీ జడ్పీటీసీ, ఎంపీపీ అమ్రేష్. కో ఆప్షన్ సభ్యులు మాబు హాల్వి చెన్నప్ప, రామన్నగౌడ్, పాల్ దినకరన్,ఏకాంబరరెడ్డి, మహీంద్రా రెడ్డి, గురున్నాథ్ రెడ్డి వీరితో పాటు ముఖ్య నాయకులు,కార్యకర్తలు, రాంపురం రెడ్డి సోదరుల అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments