బేరియాట్రిక్ సర్జరీ ద్వారా ఊబకాయానికి చెక్
వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
మంగళవారం సాయంత్రం డా. నాగలక్ష్మి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సోమాజీగూడ యశోద హాస్పిటల్స్ నందు కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఏంటరాలజిస్ట్ డా. కోన లక్ష్మి కుమారి ఆధ్య్వర్యంలో బేరియాట్రిక్ సపోర్ట్ గ్రూప్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కోన లక్ష్మి కుమారి మాట్లాడుతూ ఊబకాయం నేటి సమాజంలో ముఖ్యంగా నడివయస్కులలో ఎక్కువగా గమనించవచ్చునని, మితిమీరిన ఆహారపుటలవాట్లు, జంక్ ఫుడ్ తినటం వలన ఊబకాయస్థులుగా తయారవుతున్నారని, ఇందువలన రాబోవు రోజుల్లో మోకాళ్ళ నొప్పులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక రోగాల బారినపడే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు.
అయితే ఇలాంటి వారికోసం యశోద హాస్పిటల్స్ నందు తన ఆధ్వర్యంలో బేరియాట్రిక్ సర్జరీ ద్వారా ఊబకాయానికి చెక్ పెట్టవచ్చునని, ఇందుకుగాను రమారమి నాలుగున్నర లక్షల దాకా ఖర్చు అవుతుందని తెలియజేసారు. ఊబకాయుల బిఎంఐ ప్రకారం వారికి మొదట ఆహారపుటలవాట్లు మార్చి తరువాత సర్జరీ ద్వారా వారిని మామూలు స్థితికి తీసుకుని వస్తామని, ఇందులో ఎటువంటి అపోహలకు తావులేదని తెలియజేసారు. ఇప్పటికే పలు సర్జరీలు విజయవంతంగా పూర్తిచేసి వారి జీవితాలలో వెలుగులు నింపామని. పిల్లలు చిన్ననాటి నుండే వారి ఆహారపుటలవాట్లు మార్చుకొని, ప్రతిరోజు వ్యాయామం చేస్తూ వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని ఆమె హితువు పలికారు. విజయవంతంగా సర్జరీలు పూర్తిచేసుకొన్న పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను వ్యక్తపరిచారు. కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ అసోసియేట్ కన్సల్టెంట్ డా. ఆదిత్య ఎస్ఎస్ఎన్ కళ్యాణ్ కొండేట, కాకర్ల బాల కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments