కాపు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక భరోసా... కాపు నేస్తం
ఇచ్చిన మాటకు కట్టుబడడం ముఖ్యమంత్రి జగన్ కే సాధ్యం.
వైసిపి యువ నాయకులు ఏం.చిన్నా రాయల్.
* ఈరోజు మండల పాత్రికేయులతో వైసీపీ యువ నాయకులు మాదినేని చిన్న రాయల్ మాట్లాడుతూ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో మూడవ విడత వైఎస్ఆర్ కాపు నేస్తం కార్యక్రమాన్ని ప్రారబించి 338792 మంది కాపు అక్క చెల్లెమ్మలకు 15 వేల రూపాయల చొప్పున 508 కోట్ల ఆర్థిక సహాయాన్ని లబ్దిదారుల ఖాతాలలో నేరుగా జమ చేశారనీ; ఎన్నికల మ్యానిఫెస్టోలో "కాపు నేస్తం" ప్రస్తావన లేకపోయినా...
45-60 సంవత్సరాల వయసు ఉన్న కాపు,బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా పురోగతి సాధించాలన్న ద్వేయంతో కాపునేస్తం అందించారని;గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కాపు మహిళలల ఆర్థికాభివృద్ధికి ప్రతిఏడాదికి రూ 15 వేలు చొప్పున 5 ఏళ్లలో రూ 75 వేలు ఆర్థిక సాయం తో పాటూ ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు పెట్టి అగ్రవర్ణ, పేద, అల్పాదాయ వర్గాలకు విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు చిత్తశుద్ధితో అమలు చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు.
అంతేకాక ఆర్థిక రాజకీయ సామాజిక రంగంలో కాపులకు పెద్దపీట వేస్తూ డిప్యూటీ సీఎం గా ఒకరికి, మంత్రివర్గంలో నలుగురికి మరియు వివిధ నామినేటి పదవుల్లో కాపులకు సముచిత స్థానం జగన్మోహన్ రెడ్డి కల్పించారని అన్నారు.
మూడో విడత కాపు నేస్తం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 338792 మంది లబ్ధిదారులు 508.18 కోట్ల రూపాయలను లబ్ధి పొందారనీ, అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 10261 మందికి 15.39 కోట్లు రూపాయలు చిట్వేలు మండల పరిధిలో 306 మంది లబ్ధిదారులు 4590000 రూపాయలను లబ్ధి పొందారని
చిట్వేలి మండల పరిధిలో అర్హులైన అందరికీ కాపు నేస్తం అందడంలో సహకారం అందించిన పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డికి, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులకు మరియు చిట్వేలి మండల వైసీపీ నాయకులైన పాటూరి శ్రీనివాసులు రెడ్డికి, చెవ్వు శ్రీనివాసులు రెడ్డికి, ఎల్.వి మోహన్ రెడ్డికి, మలిశెట్టి వెంకటరమణ తదితరులకు మరియు మండల అధికారులకు.. వైసీపీ యువ నాయకులు మాదినేని చిన్నా రాయల్ ధన్యవాదాలు తెలిపారు.
Comentarios