కాపు కులాల సంక్షేమం... వైసిపి ప్రభుత్వ లక్ష్యం..
వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లిశెట్టి వెంకటరమణ.
--కాపు మహిళల్లో ఆనందకాంతులు.
---వరసగా మూడవ ఏడాది వైఎస్ఆర్ కాపునేస్తం.
వైసిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ ఈరోజు మండల పాత్రికేయులతో మాట్లాడుతూ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా ఈ రోజున కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో మూడవ విడత వైఎస్ఆర్ కాపు నేస్తం కార్యక్రమాన్ని ప్రారబించి రూ 15 వేల ఆర్థిక సహాయం లబ్దిదారుల ఖాతాలలో నేరుగా జమ చేసారనీ; మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాటకు కట్టుబడి...
కాపు,బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కాపు నేస్తం అందించారని;గతంలో ఏ ప్రభుత్వం అందివ్వని విధంగా 45 సంవత్సరాల వయస్సు నుంచి 60 ఏళ్ల వయసున్న బలిజలకు, కాపులకు , తెలగ, ఒంటరి కులాల పేద మహిళల ఆర్థికాభివృద్ధికి ఏడాదికి రూ 15 వేలుకు చొప్పున 5 ఏళ్లలో రూ 75 వేలు ఆర్థిక సాయం తో పాటూ
ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు పెట్టి అగ్రవర్ణ పేద, అల్పాదాయ వర్గాలకు విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు చిత్తశుద్ధితో అమలు చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.
ఆర్థిక రాజకీయ సామాజిక రంగంలో కాపులకు పెద్దపీట వేస్తూ డిప్యూటీ సీఎం గా ఒకరికి, మంత్రివర్గంలో నలుగురికి మరియు వివిధ నామినేటి పదవుల్లో కాపులకు సముచిత స్థానం జగన్మోహన్ రెడ్డి కల్పించారని అన్నారు.
మూడో విడత కాపు నేస్తం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 338792 మంది లబ్ధిదారులు 508.18 కోట్ల రూపాయలను లబ్ధి పొందారనీ, అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 10261 మందికి 15.39 కోట్లు రూపాయలు చిట్వేలు మండల పరిధిలో 306 మంది లబ్ధిదారులు 4590000 రూపాయలను లబ్ధి పొందాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు.
Comments