పేద ఆడబిడ్డల కుటుంబాలకు బాసట వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా.
---సంక్షేమ పథకాల రారాజు సీఎం జగనన్న.
వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లిశెట్టి వెంకటరమణ.
పేద ఆడపిల్లల కుటుంభాలుకు బాసటగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోపాలు నిలుస్తాయని వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లిశెట్టివెంకటరమణ. పేర్కొన్నారు. సీఎం జగన్ మరో హామీని అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారన్నారని, ఈ పథకంలో భాగంగా ఎస్సీ ఎస్టీలకు 100000,ఎస్సీ ఎస్టీ కులాంతర వివాహాలకు 120000, బీసీలకు 50,000,బీసీలలో కులాంతర వివాహాలకు 75000, మైనారిటీలకు 100000,వికలాంగులకు 1,50,000 భవన నిర్మాణ కార్మికులకు 40000 వర్తిస్తుందని అన్నారు.
సంక్షేమ పథకాల అమలులో జగన్ ప్రభుత్వం ప్రపంచ గుర్తింపు పొందిందన్నారు.మాట తప్పని, మడమ తిప్పని నేతగా ,ప్రజల ఆరాధ్య నాయకుడుగా జగన్ పేరొందాన్నారు.రాష్ట్ర ఆర్ధిక ఇబ్బందులు ఎన్నో వున్నా ఇచ్చిన హామీలలో ఇప్పటికి 98.44 శాతం హామీలును నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు అనుసరించేలా జగన్ పాలన సాగుతోందన్నారు.అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలను ఇంటికే పంపిస్తున్న ఘనత జగన్ దే నన్నారు.సంక్షేమ పథకాల రారాజుగా సీఎం జగన్ వెలుగొందుతున్నారని వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లిశెట్టివెంకటరమణ తెలిపారు.
Comments