వై.ఎస్.ఆర్ జిల్లా. ప్రొద్దటూరు మునిసిపల్ పరిధిలోని 14వ వార్డులో నేడు కాలువ పూడికతీత పనులు చేపట్టారు.
ఈ సందర్బంగా వైసీపీ కౌన్సిలర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా 32వ వార్డు కౌన్సిలర్ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణ పరిధిలో అయిదు ప్రధాన మురికి కాలువలు ఉన్నాయని, వీటిలో సిల్ట్ (వ్యర్ధాలు, మురుగు, పూడిక) పేరుకుపోవడం వలన వర్షా కాలంలో రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా ముందు జాగ్రత్తగా సిల్ట్ తీస్తున్నామని తెలిపారు, రోజుకు వంద నుండి నూటాముప్పై ట్రాక్టర్ల సిల్ట్ ను తరలిస్తున్నామని, టీడీపీ వారు చేసిన ఆరోపణలు సబబు కాదని, ట్రాక్టర్ల ద్వారా సిల్ట్ తరలించే క్రమంలో సిల్ట్ వీధులలో క్రింద పడకుండా తొమ్మిది వందల రూపాయల విలువ చేసే కవర్లను ట్రాక్టర్ ట్రాలీలకు అమర్చి సిల్ట్ అందులో వేస్తున్నామని, అయితే పట్టాణ వీధులగుండా ట్రాక్టర్లు వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు, గుంతలు ఉండటం వలన సిల్ట్ క్రింద పడటం వాస్తవమేనని, గత టీడీపీ పాలనలో కూడా ఇలాగే సిల్ట్ తీసేవారని గుర్తు చేశారు. ఇకపోతే వీధులలోని కాలువల్లో సిల్ట్ తీస్తున్నామని, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఎప్పటికప్పుడు వీధులలో మునిసిపల్ సిబ్బంది కాలువల్లో సిల్ట్ తొలగించే పనులలో నిమగ్నం అయ్యారని, తడి ఆరిన సిల్ట్ మునిసిపల్ వాహనాల ద్వారా తరలించేస్తున్నామని అన్నారు. టీడీపీ చేస్తున్న విమర్శలు సబబు కాదని, వారు చెప్పిన విధంగా సిల్ట్ తరలించటం వలన ప్రజలు దుర్వాసనకు, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని హితువు పలికారు.
ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ సత్యం, 10వ వార్డు కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మి దేవి, 14వ వార్డు కౌన్సిలర్ జిలాన్ బాషా, 32వ వార్డు కౌన్సిలర్ వంశీధర్ రెడ్డి, 35వ వార్డు కౌన్సిలర్ పిట్టా బాలాజీ పాల్గొన్నారు.
Комментарии