యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్, ( రాయచోటి) ప్రత్యేక అధికారిగా వైవీయూ తెలుగు శాఖ ఆచార్యులు ఆచార్య తప్పెట రాంప్రసాద్ రెడ్డిని నియమించారు. శనివారం విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య మునగల సూర్య కళావతి, కులసచివులు ఆచార్య దూర్భాక విజయరాఘవ ప్రసాద్ లు ఓఎస్డి నియామక ఉత్తర్వులను రాంప్రసాద్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ రాయచోటి నూతనంగా యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఏర్పాటవుతున్న పీజీ సెంటర్ ను అభివృద్ధి చేయడానికి అనువైన అన్ని వనరులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విశ్వవిద్యాలయం సమకూర్చుందని తెలిపారు. పిజి కేంద్రం భవనాలు, విద్యార్థుల ప్రవేశాలు, తరగతులు పరిపాలనా పరమైన అంశాల పట్ల జాగ్రత్త వహిస్తూ అభివృద్ధి చేయాలని విసి సూచించారు.
ఆచార్య రామ్ ప్రసాద్ రెడ్డి సుదీర్ఘమైన బోధనా అనుభవం తో పాటు, పరిపాలన అనుభవం దృష్ట్యా ఈ నియామకాన్ని చేపట్టారు. జాతీయ సేవా పథకం సమన్వయకర్తగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, బోర్డ్ ఆఫ్ అపాయింట్మెంట్ చైర్మన్, పలు విశ్వవిద్యాలయాలకు సిలబస్ రూపకల్పనలో సభ్యులుగా, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ మరియు ఎడ్యుకేషన్ డీన్ గా-వ్యవహరిస్తున్నారు. విద్యాలయ పరిపాలనాపరమైన విధుల్లో అనుభవం రాంప్రసాద్ రెడ్డి ని వై వియు అధికారులు గుర్తించి నియామకం చేశారు.
ఈ ఓఎస్డీగా నియమితులైన రాంప్రసాద్ రెడ్డి ని విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యుడు వై. పి. వెంకటసుబ్బయ్య, సహచరులు డాక్టర్ ఏ రామచంద్రారెడ్డి, డాక్టర్ ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
Comments