యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలి
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
యువత క్రీడల పట్ల ఆసక్తి చూపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని టిడిపి సీనియర్ నాయకులు చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈనెల 18వ తేదీ నుండి జరిగిన క్రికెట్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. ఈ టోర్నమెంట్ లో 29 టీమ్ లు పాల్గొన్నాయి. చివరి రోజు జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథి గా టిడిపి రాజంపేట సీనియర్ నేత, ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్ రాజు హాజరై గెలుపొందిన టీమ్ భువనగిరి లెవెల్స్ కు రూ.50 వేలు, బాలాజీ లెవెన్స్ రన్నర్ కు రూ.30 వేల రూపాయలు నగదు తోపాటు ట్రోపీలు, జ్ఞాపికలను ప్రోత్సాహక బహుమతి గా అందజేశారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్ర, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ హరీష్ కు జ్ఞాపికలు అందజేశారు.
10 రోజుల పాటు యువత ఉత్సాహంగా క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని ప్రతిభ ను కనపర్ఛడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పట్టణ అధ్యక్షులు రాము యాదవ్, టీ ఎన్ ఎస్ ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు పోలి శివ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి సుహేల్, నాగేంద్ర, వెంకటేష్ యాదవ్, శేషారెడ్డి, సూర్యనారాయణ రాజు, సురేష్ క్రికెట్ ఆర్గనైజర్లు రాఘవ, శివకుమార్, కిరణ్ కుమార్, బాబుల్ రెడ్డి, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
Comments