విశాఖపట్నం, ప్రసన్న ఆంధ్ర
యూట్యూబ్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలి
- విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ
విశాఖపట్నం,
యూట్యూబ్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలని, చరిత్రలో నిలిచిపోయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు యూట్యూబర్స్ కీలకంగా వ్యవహరించారని, ప్రజా సమస్యలను గుర్తించడంలో యూట్యూబర్స్ ఉన్నారని వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గుర్తించి, సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి తోడ్పాటు ఇవ్వాలని సీనియర్ టిడిపి నాయకులు విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ కోరారు. ఆదివారం విశాఖ నగరంలో అక్కయ్యపాలెం సింధూర ఫంక్షన్ హాల్ లో జరిగిన జై అసోసియేషన్ లోగో ఆవిష్కరణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ సుంకర చలపతిరావు, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ (జయ్) అధ్యక్ష, కార్యదర్శులు యు.వి. రావు ఉప్పినివలస, సంజయ్ రెడ్డి తో కలిసి అతిథులు జై లోగోన ఆవిష్కరించారు. యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించాలంటూ త్వరలో జిల్లా కలెక్టర్ కు సంఘం సభ్యులతో కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్టు దాడి సత్యనారాయణ ప్రకటించారు. సీనియర్ జర్నలిస్ట్ సుంకర చలపతిరావు మాట్లాడుతూ జర్నలిస్టులు నిబద్ధతతో, వృత్తి నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పునరుద్గాటించారు. ఈ సందర్భంగా అతిథిలకు జై సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం జై అసోసియేషన్ లో చేరిన నూతన కార్యవర్గ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.
జిల్లా సంఘం ఏర్పాటుకు సన్నాహాలు చేసినట్లు జై సంఘం ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జై కార్యవర్గ సభ్యులు మహేష్, గోవింద్, ఎంజీఆర్, పవన్, శ్యామ్, రమేష్, నిషా, ఎం. శంకర్ (గాజువాక), పివిఎన్ తెలుగు మీడియా నిర్మల జ్యోతి, జీవనాద్ (మన వైజాగ్ ), ప్రసన్న ఆంధ్ర యూట్యూబ్ ఆర్ వీక్లీ కృష్ణ (గాజువాక )నుండి అధిక సంఖ్యలో జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.
Comentários