top of page
Writer's picturePRASANNA ANDHRA

ఎన్ని వ్యవస్థలు కత్తిగట్టినా నా గుండె బెదర లేదు.. నా సంకల్పం చెదరలేదు : జగన్

ఎన్ని వ్యవస్థలు కత్తిగట్టినా నా గుండె బెదర లేదు.. నా సంకల్పం చెదరలేదు : జగన్

గుంటూరు: అధికారమంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారమంటూ నిరూపించామని వైకాపా అధినేత, సీఎం జగన్‌ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల కోసమే బతికామని చెప్పారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. ఈ ప్రయాణంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి కార్యకర్త, అభిమానికి సెల్యూట్‌ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వైకాపా ప్లీనరీని జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఆయననివాళులర్పించారు. అనంతరం ప్లీనరీకి హాజరైన వైకాపా శ్రేణులను ఉద్దేశించి జగన్‌ స్వాగతోపన్యాసం చేశారు.''2009 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. 2011లో పార్టీ పెట్టుకున్నాం. ఈ ప్రయాణంలో ఎన్ని ముళ్లున్నా, ఎన్ని రాళ్లు పడినా.. ఎన్ని వ్యవస్థలు మనపై కత్తిగట్టినా..ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు విలువ లేదు. నా గుండె బెదరలేదు.. నా సంకల్పం చెదరలేదు. నాన్న చనిపోయిన తర్వాత ఈ జగమంత కుటుంబం ఏనాడూ నా చేయి వీడలేదు. తోడుగా నిలబడ్డారు.. అడుగులు వేయడానికి బలాన్నిచ్చారు. అందుకే 2019లో చరిత్రలో కనీవినీ ఎరుగని మెజార్టీని ప్రజలు ఇచ్చారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో 175 స్థానాలకు గాను ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అధికారం అప్పగించారు. అదే సమయంలో మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొన్నవారిని దేవుడు, ప్రజలు అదే సీట్లకు పరిమితం చేశారు.అధికారంలోకి వచ్చాక పేదలు, సామాన్యులు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల కోసమే బతికాం. చెప్పిన మాట నిలబెట్టుకునేందుకే ప్రతిక్షణం తపించాం. మేనిఫెస్టోను ఎన్నికల సమయంలోనే ప్రచారం చేసి ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో పడేసిన సందర్భాలు ఈ రాష్ట్రంలో చాలాసార్లు చూశాం. అలాంటి పరిస్థితి నుంచి మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించి పాలన సాగిస్తున్నాం. తమ మేనిఫెస్టో దొరకకుండా మాయం చేసిన పార్టీ తెదేపా. యూట్యూబ్‌, వెబ్‌సైట్‌ల నుంచి వాళ్లు తీసేయించారు. మనం మాత్రం మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేసి గడపగడపకు వెళ్లి ప్రతి మనిషిని కలుస్తున్నాం''అని జగన్‌ చెప్పారు.

32 views0 comments

Comentários

Avaliado com 0 de 5 estrelas.
Ainda sem avaliações

Adicione uma avaliação
bottom of page