ప్రొద్దుటూరు మైనార్టీ నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దివంగత నేత వైఎస్ మహమూద్ 58వ జయంతిని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు ఘనంగా నిర్వహించుకున్నారు.
పేదల పక్షం వహించి ప్రజా సేవ చేసిన వైఎస్ మహమూద్‌ను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళి అర్పించారు. వైఎస్ మహమూద్ కుమారుడు, వైసిపి మైనార్టీ నాయకుడు, 22వ వార్డు కౌన్సిలర్ వైఎస్ మహమ్మద్ గౌస్ ఆధ్వరంలో వైఎస్ మహమూద్ 58వ జయంతి వేడుకలు పట్టణంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని సుమారు ఐదు వృద్ధాశ్రమాలతో పాటు, వికాస్ విహార్ మానసిక వికలాంగుల పాఠశాలలో కూడా అన్నదానం నిర్వహించారు. అలాగే పట్టణంలోని యాచకులకు, అనాధలకు కూడా ప్రత్యేకంగా ఆహార పొట్లాలు తయారు చేయించి పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా రోగుల సహాయకులకు, నిరుపేదలకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అయిల్ మిల్‌లో కూడా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. 2500 మందికి పైగా ఈ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ మహమూద్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన లేని లోటును గుర్తుచేసుకున్నారు. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ మహమూద్ ఈనాడు జనం మధ్య లేడని అయినా ఆయన ఆశయ సాధన కోసం, ఆయన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన తనయుడు వైఎస్ మహమ్మద్ గౌస్ చెప్పారు.
Commentaires