రైతులకు వెన్ను.. వైఎస్ఆర్ పంట భీమా..
భీమా చెల్లింపు కార్యక్రమంలో కొరముట్ల.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం స్థానిక ఎమ్మార్వో కార్యాలయ భవనం నందు ఈ రోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 2021 ఖరీఫ్ కు సంబంధించి పంటల బీమా పరిహారం చెల్లింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా హాజరయ్యారు.
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ...
నాగలి,భూమాత, ఎద్దులకు పూజలు చేసి రైతన్నల తమ వ్యవసాయ పనులు ప్రారంభించే శుభదినం ఏరువాక పౌర్ణమి నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు. అనంతరం "అరవై కోట్ల పదహారు లక్షల పన్నెండు వేళా పధ్నాలుగు రూపాయలు" మెగా చెక్ ను జిల్లా కలెక్టర్ గిరీషా, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు లబ్ధిదారు రైతులకు అందించారు.
జిల్లా కలెక్టర్ గిరీషా మాట్లాడుతూ ప్రతి రైతు తాము సాగు చేసిన పంటకు ఈ క్రాప్ తప్పనిసరిగా చేయించుకోవాలని తద్వారా పంట నష్టం వాటిల్లినప్పుడు పంట భీమా లభిస్తుందని తమ సచివాలయ పరిధిలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకుమార్ రెడ్డి, పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజ రెడ్డి, జడ్పీటీసీ పాలెం కోట రత్నమ్మ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సి.డి నాగేంద్ర, దేవమాచి పల్లి సర్పంచ్ ఎల్ వి మోహన్ రెడ్డి,బుడిగి శివయ్య, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు, సాయి కిషోర్ రెడ్డి,గునిశెట్టిశెట్టి ప్రశాంతి,మండల కన్వినర్ సుధాకర్ రాజు,జిల్లావ్యవసాయ శాఖ అధికారులు,రెవిన్యూ అధికారులు,ఐదు మండలాల రైతులు,సర్పంచులు ఎంపీటీసీలు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments