వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీతోఫా ఒక వరం - రాచమల్లు
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలతో ముందుకొచ్చి పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు ఈ పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. అలాగే కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు, వికలాంగుల వివాహానికి రూ.1.5 లక్షలు ప్రభుత్వం ప్రకటించింది. కాగా నేడు ప్రొద్దుటూరు మునిసిపల్ కార్యాలయంలోని దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే రాచమల్లు, చైర్మన్ భీమునిపల్లి లక్ష్మిదేవి, మునిసిపల్ కౌన్సిలర్లు గరిశపాటి లక్ష్మీదేవి, ఇర్ఫాన్ బాషా, భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, కె. కమాల్ బాషా, అనిల్ కుమార్, జిలాన్, వడ్ల ఖలీల్, వెళ్లాల మహమ్మద్ గౌస్, సత్యం తదితరులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మునిసిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఆడపిల్లలు గల తల్లితండ్రులకు ఇది శుభవార్త అని, పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఇది గొప్ప వరంగా ఆయన అభివర్ణించారు. పధకానికి అర్హులుగా వదువు వయసు పద్దెనిమిది సంవత్సారాలు, వరుడి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పధకం ద్వారా అక్టోబర్ ఒకటవ తేదీ నుండి జరగనున్న వివాహాలకు మాత్రమే వర్తిస్తుందని, ఎక్కడా తరతమ బేధాలు లేకుండా పధకం అమలవుతుందని తెలిపారు. కాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన కళ్యాణమస్తు పధకం పూర్తిగా విఫలం అయ్యిందని, అర్హులకు పధకం క్రింద రావలసిన డబ్బులు అందలేదని, ఇప్పటికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నమోదుకాబడ్డ దాదాపు ఇరవై వేల ధరకాస్తులు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా వైసీపీ పాలనలో ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నపటికీ పథకాలు అమలు తీరును ఆయన కొనియాడారు.
Comments