ప్రతి అడుగులోనూ రైతన్నకు అండ - సీఎం జగన్
వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
గుంటూరు జిల్లా, చుట్టగుంటలో వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. పథకం ద్వారా రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి సీఎం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీతో పాటు 5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం బటన్ నొక్కి జమచేశారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమం జరుగుతోందని.. ప్రతి అడుగులో రైతన్నకు అండగా ఉంటున్నామన్నారు. ప్రతీ గ్రామంలో విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతీదశలో రైతుకు తోడుగా ఉండేలా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. ట్రాక్టర్లతో సహా వస్తువులను రైతులకు అందుబాటులో ఉంచాం. రూ.2016 కోట్లతో ప్రతి ఆర్‌బీకే స్థాయిలో 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను స్థాపించేందుకు శ్రీకారం చుట్టబోతున్నాం. 3,800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
Comments