వైఎస్సార్ యంత్ర సేవ పథకం కింద వరి కోత యంత్రం పంపిణీ.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవ పథకంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీప్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు కాచాపురం గ్రామానికి చెందిన రాఘవేంద్ర రైతు మిత్ర గ్రూపుకు వరి కోత మిషన్ మంజూరైంది. మంజురైన యంత్రాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీప్ రెడ్డి చేతుల మీదుగా పూజ చేసి యంత్రం ప్రారంభించారు. ఈ సందర్బంగా వై. ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ వరి కోత యంత్రం విలువ రూ 29.95 లక్షలు ఇందులో రూ 8.80 లక్షలు సబ్సిడీ, రూ 12 లక్షల కేడీసీసీ బ్యాంకు ద్వారా రుణం మంజూరు కాగా గ్రూపు మిగతా డబ్బులు మాత్రమే చెల్లించడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు, వైఎస్సార్సీపీ మండల ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, వ్యవసాయ అధికారి శివశంకర్, రాఘవేంద్ర రైతు మిత్ర గ్రూపు కన్వీనర్ పెట్రోల్ బంక్ శీనన్న, నాయకులు బొంబాయి శివ, ఏఈవో నరసింహ, వీఏఏ దీనేష్ మరియు బ్యాంక్ అధికారులు అయ్యస్వమి సివప్ప గౌడ్. తదితరులు పాల్గొన్నారు.
Comments