సేవకులను పాలకులు చేసిన పార్టీ వైసిపి - సిద్ధవటం యానాదయ్య
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తూ సేవకులను పాలకులుగా చేసిన పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే అది వైయస్సార్సీపి పార్టీ మాత్రమే అని టిటిడి బోర్డు మెంబర్ సిద్దవటం యానాదయ్య పేర్కొన్నారు. పలువురు బీసీ సామాజిక వర్గానికి చెందిన చైర్మన్లు, డైరెక్టర్ల తో కలిసి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ లకు అటు రాజకీయంగాను ఇటు ఆర్థికంగానూ పెద్ద పీట వేసి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చారని, 26వ తేదీ నుండి ప్రారంభమైన సామాజిక సాధికార బస్సుయాత్ర దిగ్విజయంగా నడుస్తోందని, శనివారం అనగా 28వ తేదీన ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో బస్సుయాత్ర నిర్వహించనున్నామని, కావున నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఈ బస్సు యాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు.
బీసీ ల సామాజిక, ఆర్థిక అభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేసిందని, బీసీల లోని 139 ఉపకులాలకు 59 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, గడిచిన నాలుగున్నర సంవత్సర పాలనలో ప్రతి సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూ బీసీలకు చట్టసభలలో శాసనసభలో అవకాశం కల్పించామని, టిటిడిలో నాయి బ్రాహ్మణుల సమస్యలపై పోరాడటానికి తాను అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా పార్టీ తనను గుర్తించి, వారి సమస్యల పోరాటానికై తనను టీటీడీ బోర్డు మెంబర్ గా ఎంపిక చేసిందని గుర్తు చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు అభివృద్ధి చెందాలంటే జగన్ మరో మారు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. బీసీల అభివృద్ధిని అడ్డుకోవడం కోసం బిజెపి, టిడిపి, జనసేన కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింక విజయలక్ష్మి, నాటక మండలి కార్పొరేషన్ డైరెక్టర్ బండారు సూర్యనారాయణ, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ రాధా నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
Comments