రైల్వే కోడూరు సమస్యల పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం..!! - సిఐటియు నాయకులు చంద్రశేఖర్ విమర్శ.
రైల్వేకోడూరులో దీర్ఘకాలికంగా ప్రజాసమస్యలు ఎదుర్కొంటున్నారని, అవి ఎన్నికల వాగ్దానాలు కే పరిమితమైనవని , వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయినా ఒక్క సమస్య పరిష్కరించలేదని, సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సి హెచ్ చంద్రశేఖర్ విలేకర్ల సమావేశంలో విమర్శించారు.
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు సిఐటియు ఆఫీసులో బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా పట్టణంలో ట్రాఫిక్ నివారణ కోసం బైపాస్ రోడ్డు కావాలని, పోరాడుతున్న పట్టించుకోలేదన్నారు, రాజధానికి దగ్గరగా ఉండే, వెంకటగిరి రోడ్డు పూర్తి చేయలేదన్నారు, అనే గ్రామాలు ఇబ్బంది పడుతున్నా రైల్వే ట్రాక్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించ లేదన్నారు, ఎమ్మెల్యే సొంత గ్రామం రెడ్డి వారి పల్లి కూలిన బ్రిడ్జి, నిర్మాణానికి ఎస్టిమేషన్ లకే పరిమితమై కాలయాపన జరుగుతుందన్నారు.
వరదల్లో కోతకు గురవుతున్న, కోడూరు గుంజన నది కి ప్రొటెక్షన్ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. 200 బెరైటీస్ మిల్లులు మూతపడి, వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని, మిల్లులకు క్రసింగ్ ఆర్డర్ ఇచ్చి, తెరిపించాలని డిమాండ్ చేశారు. పండ్లకు ప్రసిద్ధి గాంచిన కోడూరు లో మూసివేసిన అప్స జూసుఫ్యాక్టరీని విస్తృత పరిచే తెరిపించాలని డిమాండ్ చేశారు. కోడూరు లో సబ్ రిజిస్టర్ ఆఫీసు లేదని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేయాలన్నారు. అన్నమయ్య జిల్లాలో విస్తృతంగా ఖనిజాలు ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు.
ఓబులవారిపల్లె మండలం గాదెల లో, ఇనుప ఖనిజాన్ని వెలికితీసి అనుబంధ పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ ఎర్రచందనం అరికట్టి, ప్రభుత్వమే అనుబంధ పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. కోడూరు నియోజకవర్గంలోని ప్రజలు ఉపాధి లేక, గల్ఫ్ కంట్రీ పై ఆధార్ పడ్డారని, కోడూరు లో 20 వేల మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని, డిమాండ్ చేశారు. పేదల కోసం టిటిడి కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలన్నారు. మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు. గాలేరు-నగరి కాలవ పూర్తిచేయాలని, చెరువులకు అనుసంధానం చేయాలన్నారు.కనీసం వైసీపీ ప్రభుత్వం నిధులు బడ్జెట్లో కేటాయించిన ఖర్చు చేసి పని చేయలేదన్నారు,
చిట్వేలి పెనగలూరు కీ, సోమశిల బ్యాక్ వాటర్ ఉపయోగించాలి అన్నారు, చిట్వేలి లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, డిమాండ్ చేశారు. పుల్లంపేట లో పుల్లం గేరు ఆనకట్ట నిర్మించాలన్నారు, దళితులకు గిరిజనులకు, అసైన్మెంట్ కమిటీ ద్వారా భూ పంపిణీ చేయాలని, డిమాండ్ చేశారు. కోడూరు నుండి జిల్లా కేంద్రమైన రాయచోటికి ఒక్క ఆర్టీసీ బస్సు కూడా లేదన్నారు. కోడూరు లో ఆర్టీసీ గ్యారేజీ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ నియోజకవర్గం కోడూరు అభివృద్ధికి నోచుకోవడం లేదని, నాలుగు సార్లు ఏకధాటిగా, శాసనసభ్యులుగా కొరముట్ల శ్రీనివాసులు నీ గెలిపించిన, చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఎస్సీ , ఎస్ టి గ్రామాలు, తన సామాజిక వర్గానికి కూడా న్యాయం జరగలేదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు, నవరత్నాలు కాగితాలకే పరిమితమైనవని అన్నారు. ఇరిగేషన్ చెరువులు, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యూఎస్, కు, నిధుల్లేక, పనులు లేక వెల వెల పోయాయన్నారు. గ్రామ పంచాయతీలు నిధుల్లేక అభివృద్ధి కుంటుపడింది అన్నారు. కోడూరు సమగ్ర అభివృద్ధి కోసం, కోడూరు అభివృద్ధి పోరాట కమిటీ, సి ఐ టి యు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో, సి ఐ టి యు ఉపాధ్యక్షులు, లింగాల యానాదయ్య, కోడూరు అభివృద్ధి పోరాట కమిటీ నాయకులు, కర్ర తోటి హరి నారాయణ, ఆవాజ్ మండల కన్వీనర్, పి. మౌలాలి భాష, తదితరులు పాల్గొన్నారు.
Comentarios