వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ జెండా వాడ వాడల రెప రెపలాడాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో గురువారం కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, రాష్ట్ర డైరెక్టర్లులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ముఖ్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఈనెల శనివారం నిర్వహించనున్న ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సేవ దృక్పథంతో నిర్వహించాలని తెలిపారు.ప్రతి వార్డులో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రతి కార్యాలయం ఆవరణలో పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు.అదే విదంగా అదే రోజు సాయంత్రం అక్కయపాలెం 80 అడుగుల రహదారి వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కె.కె రాజు గారు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు,స్టాండింగ్ కమిటీ మెంబర్లు వి.ప్రసాద్,శశికళ, కార్పొరేటర్లు కె.అనిల్ కుమార్ రాజు,సాడి పద్మారెడ్డి,సారిపిల్లి గోవింద్,ఆళ్ల లీలావతి&శ్రీనివాసరావు,పి.ఉషశ్రీ,కె.కామేశ్వరి,బర్కత్ అలి,కో-ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు,మాజీ కార్పొరేటర్లు బులుసు జగదీష్,పోతు సత్యనారాయణ,వార్డు అధ్యక్షులు నీలి రవి,పైడి రమణ,కె.పి రత్నాకర్,దుప్పలపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర డైరెక్టర్లు రాయుడు శ్రీనివాసరావు, యన్.రవికుమార్,ప్రసాద్,దిడ్డి రమేష్,ఐ.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comentários