సినిమా రంగంలోకి మంత్రి విడదల రజిని?
హైదరాబాద్ లో సినిమాలు తీయడానికి కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన మంత్రి రజిని?
సినిమాలు.. రాజకీయం.. ఒకదానికొకటి విడదీయరాని కవల పిల్లల్లాంటివి. సినీ రంగంలో ఉన్నవారు తర్వాత చూపు రాజకీయాలపై పడుతుంది. అలాగే రాజకీయం రంగంలో ఉన్నవారు సినీరంగంలోకి ప్రవేశిస్తారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఆ తర్వాత ఎంతోమంది సినీ తారలు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు నిర్మించనవారు కోకొల్లుగా ఉన్నారు. ఈ బాటలోనే ఏపీకి చెందిన మంత్రి విడుదల రజిని అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఒక నిర్మాణ సంస్థను స్థాపించి, ఫిలింనగర్ లో కార్యాలయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి నిర్మించే తొలి సినిమాకు కథ సిద్ధమైందని, దర్శకుడు, కథానాయకుడు కూడా సిద్ధమయ్యారని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు.
రాజకీయ రంగం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి ఆర్టిస్టులుగా విజయవంతమైనవారున్నారు. అలాగే కొందరు రాజకీయ నాయకులు తెరవెనక ఉండి తెరముందు వేరేవారితో నడిపస్తున్న సందర్భాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించి విడుదల రజని అధికారికంగానే ప్రకటిస్తారా? ఇతరుల పేర్లేమైనా ప్రకటిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
Comentarios