రష్యా -- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతూ తెలుగు విద్యార్థులు ప్రాణభయంతో ఉండగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌజన్యంతో వారందరినీ వారి వారి స్వస్థలాలకు క్షేమంగా చేర్చేందుకు ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఉక్రెయిన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆంధ్ర రాష్ట్ర తెలుగు విద్యార్థులు ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకోగా.. ప్రభుత్వ విప్ రైల్వేకోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు వారికి స్వాగతం పలికి వారి యోగక్షేమాలను గురించి అడిగి తెలుసుకుని వారందరినీ తమ గమ్యస్థానాలు చేర్చే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కొరముట్ల తో మాట్లాడుతూ ఉక్రెయిన్ దేశం నుంచి మా అందరినీ మా సొంత ఊర్లకు చేర్చడంలో చొరవ చూపిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ఎంతో బాధ్యతగా విమానాశ్రయానికి వచ్చి మా అందరి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్న కొరముట్ల కు ధన్యవాదాలు తెలిపారు.
Comments