ఉక్కునగరం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, ఉక్కునగరంలో గల YSRTUC ఆఫీస్ వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కర్రీ దాలి నాయుడు గారి అధ్యక్షతన YSRTUC ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం జరిగింది.
గుర్తింపు సంఘ ఎన్నికల తేదీ ప్రకటన సందర్భంగా నాయకులు కార్యకర్తలు అభిప్రాయాలు తెలియజేశారు ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి వై మస్తానప్ప గారు మాట్లాడుతూ కార్మికులు నూతన పే స్కేల్, వేజ్ ఎరియర్స్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారని, ఉత్పత్తికి తగ్గ ఇన్సెంటివ్ విషయంలో కావచ్చు , EL encashment విషయంలో, ప్రధాన విభాగాల్లో మాన్ పవర్ కొరత విషయంలో మరియు ప్రధానంగా వైద్య సదుపాయాలు మరియు రిఫరల్ విషయాలలో ఆపధర్మ గుర్తింపు సంఘ తీరుపై కార్మికుల అసంతృప్తిగా ఉన్నారన్నారు.
ఇప్పటికే మన కర్మాగారంలో గుర్తింపు సంఘం పదవీ కాలం ముగిసి దాదాపు రెండు సంవత్సరాలు అయ్యిందని, రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికల నిర్వహణకై అఖిల పక్ష కార్మిక సంఘాలతో RLC సమావేశం జరిపి ఎన్నికల తేదీని ప్రకటించారని అన్నారు. YSRTUC ప్రేసిడెంట్ GV రమణారెడ్డి గారు మాట్లాడుతూ కార్మికులలో వ్యతిరేకత గల కొన్ని కార్మిక సంఘాల కార్యకర్తలు ఎన్నికల విషయంలో మరియు విశాఖ ప్రైవేటీకరణ ఉద్యమంలో కార్మికుల ఐక్యతకు భంగం కలిగే విధంగా కల్పిత దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు.
ఈ సమావేశంలో వై మస్తానప్ప, Gv రమణ రెడ్డి, కర్రీ దాలి నాయుడు, కాకర వెంకట్రావు, ఎన్నేటి రమణ,దల్లి మహేశ్వర రెడ్డి,పిట్టరెడ్డి, గెద్దాడఅప్పలరాజు, శశి భూషణ్ రావు, దాసరి పుల్లారావు,k. సుబ్బారావు, చేపర్తిని రాజు, బిసాయి, నల్ల శ్రీను, వాస అప్పలరెడ్డి, వై ఎల్ నాయుడు, బి ఆదినారాయణ, మురళి, నర్సింహా రావు, గెద్దాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments