ఉక్కునగరం ప్రసన్న ఆంధ్ర విలేకరి, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక లిఖిత పూర్వక హామీ ఇచ్చి నంతవరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని. ఈ డి వర్క్స్ బిల్డింగ్ దగ్గర ధర్నా లో మాట్లాడుతూ
ప్రధానమైన డిమాండ్లు :
ఏ .ఐ .టి .సి మంత్రి రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులు కరోనా టైంలో రోజు విడిచి రోజు చెయ్యమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు లాక్ డౌన్ సమయం లో ప్రతి కాంట్రాక్టు కార్మికుడు రోజు విడిచి రోజు పనిచేయమని నెలసరి జీతం ఇస్తామని స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ హామీ ఇవ్వడంతో కాంట్రాక్ట్ కార్మికులు విధులు చేయడం నిర్వహించారు.
వై .ఎస్ .ఆర్ .టి .సి పిట్ట రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ చనిపోయిన కార్మికునికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా గతంలో 2012లో అమలు చేయడం జరిగినది . దాని కాలపరిమితి 2015లో ముగియడంతో దానిని 30 లక్షలు చెయ్యమని ఎక్కడ చనిపోయిన 24/7 కార్మికులకు నష్టపరిహారం అందించాలని.
టి.ఎన్.టి. యూ.సి బొడ్డు పైడ్రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూకాంట్రాక్ట్ మారినా వర్కర్ మారకూడదు అనే విధానంలో టెండర్లలో ఇంక్లూడింగ్ చేయాలని .
హెచ్.ఎమ్.ఎస్ యూనియన్ గణపతి రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల వ్యాఖ్యలు సి బుక్ ఆధారంగా లోనకి వదిలే విధంగా టెండర్లలో పర్మినెంట్ గా చేయాలని.
సి .ఐ .టి .యు నమ్మి రమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వర్తిస్తుండగా చనిపోయిన కార్మికుడికి ఇంటిలో ఉపాధి కల్పించాలని
బొడ్డు గోవింద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ
కాంట్రాక్టర్ నష్టపోయారని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయిన సమయంలో మేనేజ్మెంట్ ఆ బాధ్యత తీసుకుని కాంట్రాక్ట్ కార్మికులకు ఫుల్ అండ్ ఫైనల్ ఫైనల్ సప్లిమెంట్ చేయాలని.
ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాలు తేల్చి చెప్పారు. ఉక్కు లొ నాలుగు వ రోజు జరిగిన సమ్మె సందర్భంగా. ఇ డి వర్క్స్ వద్ద వేలాది మంది కార్మికులతో భారీ ధర్నా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ. ఉక్కు యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కారం పట్ల స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు.అది మానేసి యాజమాన్యం బెదిరింపు చర్యలకు పాల్పడితే ఫలితం ఉండదు అని అన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తె రేపు చలో అడ్మిన్ ముట్టడి కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఓ వి రావు. రమణ మూర్తి. పితాని భాస్కరరావు. సత్యారావు. బి కన్నబాబు. నర్సింగరావు. కె సత్యవతి. గురప్ప తదితరులు కాంట్రాక్ట్ కార్మికులు వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు.
Comments