ఉక్కునగరం ప్రసన్న ఆంధ్ర, తొలి సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి వేడుక
మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం సెంట్రల్ స్టోర్ జంక్షన్ YSRTUC UNION పాయింట్ వద్ద YSRTUC OBC నాయకులు నక్క వెంకటరమణ, గెద్దాడ అప్పలరాజు ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా YSRTUC ప్రధాన కార్యదర్శి వై మస్తానప్ప మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, స్త్రీ విద్య కోసమే కాక *సత్యశోధక సమాజ్ సంస్థ సారథ్యంలో తన సహచరుడు ఎన్.ఎమ్.లోఖండేతో బొంబాయి నూలు మిల్లులలోని శూద్రాతిశూద్ర కార్మికుల హక్కుల కోసం, 12 గంటల పనిదినం.
ఆదివారం సెలవుకై ట్రేడ్ యూనియన్‌ను నెలకొల్పి పోరాటాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వై మస్తానప్ప, కర్రీ దాలినాయుడు, నల్లమిల్లి శ్రీనివాస రెడ్డి, నక్క వెంకటరమణ, గెద్దాడ అప్పల్రాజు, మార్టుపూడి పరదేశి,మరిపి జగ్గారావు, పిట్ట రెడ్డి, దాసరి పుల్లారావు, మద్ది అప్పలరాజు, నంబూరి వెంకట రెడ్డి, ch వెంకటేశ్వరరావు, కొవిరి అవతారం, బోడెం రాజు, నల్ల శ్రీనివాస్, కాకర్ల నాగేశ్వరరావు, చంద్రశేఖర్ శకునాల తదితరులు పాల్గొన్నారు.
Comments