చిత్తూరు జిల్లా, ఈరోజు (12-01-2022) స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నేషనల్ యూత్ డే సందర్భంగా నెహ్రు యువకేంద్రం ఆధ్వర్యంలో, చిత్తూరు జిల్లాకి సంబందించి 2020-21సం౹౹లో యువనేస్తం అందించిన సేవలకు గాను ఉత్తమ యువజన సంఘంగా జిల్లా స్థాయిలో మొదటి స్థానం మరియు రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచిందని జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. ఈ అవార్డును కార్యకమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ గారి చేతుల మీదుగా యువనేస్తం సభ్యులకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జేసీ రాజశేఖర్ మాట్లాడుతూ యువనేస్తం సభ్యులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మన జిల్లా రెండో స్థానం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. యువనేస్తం అధ్యక్షుడు మునిశేఖర్ మాట్లాడుతూ మా సేవలను గుర్తించి, మాకు ఈ ఆవార్డును ఇచ్చిన జిల్లా కలెక్టర్ హరినారాయణ కి, జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే యువనేస్తం కార్యక్రమాలు చేయడానికి సహకరించి, విరాళాలు అందించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు మా కార్యక్రమాలను ప్రజలకు తెలియ జేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, యువనేస్తం తరపున పేదలకు అండగా ఉండటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, అనాధలు మరియు పేదల సేవే, భగవంతుని సేవ అనే తత్వాన్ని చాటి చెప్పిన స్వామి వివేకానంద మాటలే మాకు స్ఫూర్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ ఆముద, NYK బాబీ రెడ్డి, యువనేస్తం రాష్ట్ర కన్వీనర్ హనుమంతు నాయక్, యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వినోద్, కార్యదర్శి జస్వంత్, వైష్ణవి, ధనలక్ష్మి, పావని మరియు NGO పెద్దలు, వాలంట్రీలు తదితరులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Commentaires