top of page
Writer's pictureEDITOR

నారా లోకేష్ వద్ద తమ సమస్యలను మొరపెట్టుకున్న ముస్లిం మైనారిటీలు

నారా లోకేష్ వద్ద తమ సమస్యలను మొరపెట్టుకున్న ముస్లిం మైనారిటీలు

కర్నూలు, నేడు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ముస్లిం మైనారిటీలు కలిసి తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పరిష్కరించాలన్నారు..


మైనారిటీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన దుల్హన్ పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. పేద ముస్లింలు ఉన్నత విద్యను అభ్యసించ లేకపోతున్నారని.. వారికి ఆర్థిక చేయూతనివ్వాలన్నారు. మైనారిటీల సంక్షేమానికి కేటాయించిన నిధులను వైసీపీ ప్రభుత్వం స్వాహా చేస్తోందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రోషిణి, దుకాన్-మకాన్ పథకాలు నేడు రావడం లేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై వేధింపులు అధికమయ్యాయని తెలిపారు. ముస్లింలకు కేజీ టు పీజీ వరకు మైనారిటీ విద్యార్థులకు ఉచిత విద్యనందించాలన్నారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో హజ్ యాత్రకు పంపించాలన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మైనారిటీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని ముస్లిం మైనారిటీలు కోరారు..

ముస్లిం మైనారిటీల సమస్యలపై లోకేష్ స్పందిస్తూ... ''జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గమూ ప్రశాంత జీవనం గడిపే పరిస్థితులు లేవు. తాలిబన్ తరహా పాలన కొనసాగిస్తూ మైనారిటీలకు నరకం చూపిస్తున్నారు. తాజాగా మదనపల్లిలో మైనారిటీ యువకుడు అక్రమ్ ను పులివెందుల బ్యాచ్ అన్యాయంగా పొట్టనబెట్టుకుంది. వైసీపీ నాయకులు వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం, మిస్బ ఆత్మహత్య చేసుకున్నారు. మసీదు ఆస్తుల రక్షణ కోసం పోరాడిన ఇబ్రహీంను నర్సరావుపేటలో దారుణంగా నరికిచంపారు. మైనారిటీల సబ్ ప్లాన్ నిధులు రూ.5,400 కోట్ల దారిమళ్లించి ముస్లింలకు అన్యాయం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలుచేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం..

పూర్తి ప్రభుత్వ ఖర్చులపై పేద ముస్లింలను హజ్ యాత్రకు పంపే ఏర్పాట్లు చేస్తాం'' అని పేర్కొన్నారు..

20 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page