top of page
Writer's pictureEDITOR

అంతరిక్షంలోకి యువరాజ్ సింగ్ బ్యాట్‌

భారత స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ 2003లో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు.అప్పుడు సెంచరీ చేసిన బ్యాట్‌ని అంతరిక్షంలోకి పంపారు. క్రికెట్ బ్యాట్‌ను అంతరిక్షంలోకి పంపడం ఇదే తొలిసారి.

2/4ఈ ఫీట్ గత వారం ఆసియా NFT మార్కెట్ కలెక్షన్ సహకారంతో జరిగింది. యువరాజ్‌కు NFTలను జారీ చేయడానికి కంపెనీ అతనితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోను రూపొందించారు. ఈ 3D వీడియో డిసెంబర్ చివరి వారంలో Collexion వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.యువరాజ్ సింగ్ ఈ బ్యాట్‌పై సాంకేతికంగా కొన్ని పరికరాలను అమర్చారు. అందులో మనం బ్యాట్‌ అంతరిక్షంలో ఎగురుతున్నట్లు చూడవచ్చు. దీంతో పాటు ఈ బ్యాట్‌పై యువరాజ్ సింగ్ ఆటోగ్రాఫ్ కూడా ఉంది.దీని గురించి యువరాజ్ మాట్లాడుతూ.. 'నా మొదటి సెంచరీ బ్యాట్‌ అంతరిక్ష ప్రయాణానికి వెళ్లినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లో అభిమానులతో కనెక్ట్ అవ్వడం చాలా ఉత్సాహంగా ఉంది అని అన్నాడు.


3 views0 comments

תגובות

דירוג של 0 מתוך 5 כוכבים
אין עדיין דירוגים

הוספת דירוג
bottom of page