వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
నేడు ప్రొద్దుటూరు బీజేపీ కార్యాలయం నందు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్బంగా. రమేష్ నాయుడు మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో ప్రతి ఇంటిపై జాతీయ జండా ఎగురవేయాలని కోరారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య మన తెలుగువాడు కావటం, తెలుగువారు గర్వించదగ్గ విషయమని, కావున అతని జయంతి నుండి 'హర్ ఘర్ తిరంగా' అనే నినాదంతో బీజేపీ పిలుపిస్తోందని. రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా నేడు దేశభక్తిని ప్రజలు చాటుకుంటున్నారని, అందుకు ఉదాహరణే నేడు సామాజిక మాధ్యమాలలో ప్రజలు వారి డీపీ లలో జాతీయ జెండా చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారని, చివరికి జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారని, నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో స్వచ్చంద సంస్థలు, ప్రజా సంఘాల సహకారంతో దాదాపు పది లక్షల జాతీయ జెండాలు ప్రతి ఇంటికి వితరణ చేయనున్నట్లు, అలాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు జాతీయ జెండాలు వితరణ చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో వైసీపీ పాలనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ప్రభుత్వ పాలనలో పూర్తిగా విఫలమయ్యారని, పారిశ్రామికంగా అభివృద్ధి సూన్యం అని, దశల వారి మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్ అది విస్మరించి నేడు మద్యం రేట్లు పెంచి మాట తప్పారని, ప్రభుత్వోద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితిలో నేడు జగన్ సర్కార్ ఉందని, రైతుల బాధలు అస్సలు పట్టించుకోవటం లేదని, ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నోరు మెదపటం లేదని. అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితులకు ఇంతవరకు న్యాయం జరుగలేదని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు విడుదల చేస్తామన్న ప్రభుత్వం ఉద్యోగ కల్పన విషయంలో వైఫల్యం చెందారని ఆరోపంచారు. సచివాలయ వ్యవస్థలోని వాలంటీర్లు కూడా అసహనానికి లోనవుతున్నారని ఎంత పనికి అంత వేతనం తీసుకునే హక్కును వారు కోల్పోయారని గుర్తుచేశారు.
కడప జిల్లా బీజేపీ కార్యదర్శి గొర్రె శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రొద్దుటూరు జమ్మలమడుగు నియోజకవర్గాలలో చేనేతల వృత్తుల ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, గత ఏడాది దేశ వ్యాప్తంగా ఎనిమిది టెక్స్టైల్ పార్కులకు అనుమతి ఇవ్వగా రాష్ట్రానికి ఒక టెక్స్టైల్ పార్కు కూడా రాకపోగా, పక్క రాష్ట్రమైన తెలంగాణ లోని సిరిసిల్లలో టెక్స్టైల్ పార్కు నెలకొల్పారని దాని వలన దాదాపు లక్షనర్ర మంది చేనేతలకు ఉపాధి అవకాశాలు లభించాయని,రాష్ట్రానికి టెక్స్టైల్ పార్కు తీసురావటానికి కనీసం ఈ ప్రభుత్వం కృషి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు వేయి ఎకరాలలో టెక్స్టైల్ పార్కు నెలకొల్పటానికి జిల్లా కలెక్టర్ నివేదిక సిద్ధం చేశారని గుర్తు చేశారు. కాగా ఆగష్టు ఏడవ తేదీన చేనేత దినోత్సవం సందర్బంగా ఆయన చేనేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు జాతీయ జెండాలను వితరణ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Commentaires