ప్రొద్దుటూరు రాజకీయాల్లో పెనుమార్పు - కొనిరెడ్డిని టిడిపిలోకి ఆహ్వానించిన వరద
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నంద్యాల వరదరాజుల రెడ్డిని ప్రకటించినప్పటి నుండి పెద్దాయన ఆధ్వర్యంలో వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు ఊపందుకున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు వైసీపీ ముఖ్య నాయకులు టిడిపి తీర్థం పుచ్చుకోగా, తాజాగా శుక్రవారం ఉదయం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ ,కడపజిల్లా సర్పంచులు సంఘ అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి నివాసానికి టిడిపి అభ్యర్థి వరదరాజుల రెడ్డి అనుచరులతో వెళ్లి ఆయనను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. కొనిరెడ్డి చేరికతో టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బలోపేతం అవుతుందనడంలో సందేహమే లేదు. ఈ మధ్య గత కొంతకాలంగా కొనిరెడ్డి శివచంద్రారెడ్డి బాహాటంగానే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారాలు, ర్యాలీలు నిర్వహించడం తెలిసిందే. రేపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన ప్రొద్దుటూరులో ఉండడంతో కొనిరెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నట్లు తెలుస్తోంది.ప్రొద్దుటూరు లో సమస్యాత్మక ప్రాంతాలకు కొనిరెడ్డిని వరద ఇంచార్జిగా నియమించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ కార్యక్రమంలో వరద వెంట టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, రాజుపాలెం మాజీ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురాంరెడ్డి, ఈవి సుధాకర్ రెడ్డి, 22 వార్డ్ కౌన్సిలర్ వైఎస్ మహమ్మద్ గౌస్, టీడీపీ యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి, బచ్చల ప్రతాప్, నల్లబోతుల నాగరాజు, పలువురు టిడిపి నాయకులు, ముఖ్య అనుచరులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఈరోజు సాయంత్రం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కొనిరెడ్డి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. రాజీనామా పత్రాన్ని కడప వైసీపీ అధ్యక్షులు మేయర్ సురేష్ బాబుకు ఆయన ముఖ్య అనుచరులతో వెళ్లి ఇవ్వనున్నట్లు స్పష్టంగా తెలియవస్తోంది.
Commentaires