కృష్ణాజిల్లా, నందిగామ, చందర్లపాడు మండలం కాసరబాధ గ్రామంలో జనాన్ని అవతల ఒడ్డుకి తీసుకు వెళుతున్నారు కృష్ణా నదిలో నీరు తగ్గటం వలన బండలు బయటపడ్డాయి. పడవ నడిపే వారు అనధికారికంగా రాత్రి 10 గంటల వరకు పడవ నడుపుతున్నారు. గ్రామంలో కొంతమంది పడవ నడిపే వారిని అనగా గో కర్ల వెంకటకృష్ణ అనే వ్యక్తిని అనధికారికంగా పడవ నడప వద్దని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పర్మిషన్ లేకుండా నడప వద్దని నిలదీయగా నాకు లోకల్ గా సపోర్టు ఉందని అన్ని పర్మిషన్ లు ఉన్నాయని నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని చెబుతున్నాడు. ఈ విషయంపై అధికారులకి పోలీసులకి తెలియజేయగా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అనధికారికంగా పడవ నడుపుతూ ఒక్కొక్కరి వద్ద 100 నుంచి 200 రూపాయలు బైకు ₹100 వసూలు చేస్తున్నారు గతంలో ఇలాంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు అప్పుడు పోలీసు వారు వచ్చి పడవ నడిపే వారిపై చర్యలు తీసుకొని పడవలు నడపకుండా చేసి ఉన్నారు.
top of page
bottom of page
Comentários