కెసిపి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేసి పుల్లయ్య 12వ సంస్మరణ సభ, జాతీయ పురస్కారాలు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
శుక్రవారం ఉదయం కొర్రపాడు రోడ్డులో గల కేసీ పుల్లయ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వ్యవస్థాపకులు కే. కృష్ణవేణినమ్మ, కే. అనిల్ కుమార్, కే. సుశీల్ కుమార్, పి. వాసుదేవరావు ల ఆధ్వర్యంలో కీర్తిశేషులు కేసి పుల్లయ్య ద్వాదశ వర్ధంతి సంస్మరణ సభ, అలాగే కేసి పుల్లయ్య స్మారక జాతీయ పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ జనరల్, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, మినిస్ట్రీ ఆఫ్ జెల్ శక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అశోక్ కుమార్, సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ సంతోష్ కుమార్ క్రాలేటి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి చంద్రశేఖర్, వైస్ ఛాన్సలర్ రుషి హుద్ యూనివర్సిటీ శోబిత్ మాధుర్, తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ టీ మారుతీ ప్రసాద్ పాల్గొనగా, తెలంగాణ రాష్ట్రం నుండి కళా రత్న అవార్డుకు పద్మశ్రీ వేలు ఆనందాచారి, ఉత్తరాకాండ్ రాష్ట్రం నుండి హరితరత్న అవార్డుకు పద్మశ్రీ బసంతి దేవి, రాజస్థాన్ రాష్ట్రం నుండి సేభారత్న అవార్డుకు డాక్టర్ కృతి భర్తీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విద్యారత్న అవార్డుకు డాక్టర్ సెట్టెం ఆంజనేయులు కేసి పుల్లయ్య స్మారక జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, రాయలసీమ రత్నగా పేరు పొందిన కీర్తిశేషులు కేసి పుల్లయ్య సంస్మరనార్థం ప్రతి సంవత్సరం పేద విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలతో పాటు వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి కళా రత్న, సేవా రత్న, విద్యారత్న, హరితరత్న పురస్కారాలు అందించటం పరిపాటిగా మారిందని, అందుకు ఫౌండేషన్ వ్యవస్థాపకులను అలాగే కేసి పుల్లయ్య కుటుంబ సభ్యులను కృతజ్ఞతలు తెలుపుతూ అభినందిస్తున్నట్లు వారు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు తమ ఫౌండేషన్ ద్వారా చేయనున్నట్లు కేసీ పుల్లయ్య ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు, ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పొందుతున్న విద్యార్థులు, పలువురు సామాజిక సేవ తత్పరులు, కేసి పుల్లయ్య అభిమానులు, కుటుంబ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments