టిడ్కో కట్టడాల కూల్చివేత పై స్పందించిన వరద
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
టిడిపి ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం టిడ్కో ఇల్లు నిర్మించి ఇవ్వాలనే సదుద్దేశంతో 2018 వ సంవత్సరంలో 4176 ఇళ్ల కొరకు 44 ఎకరాల అపెరల్ పార్క్ స్థలం నాటి టిడిపి ప్రభుత్వం కేటాయించిందని, అయితే 2019 వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం స్వార్థ బుద్ధితో పనులు కొనసాగించలేదని, అత్యంత ఆధునికంగా నిర్మిస్తున్న డిడ్కో ఇళ్లను గుర్తు తెలియని వ్యక్తులు నిన్న గుణాధులతో సహా పెకిలించి వేయడం దారుణమైన చర్యగా ఆయన అభివర్ణిస్తూ, మంగళవారం ఉదయం నెహ్రు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రొద్దుటూరు టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి జగన్ సర్కార్ అలాగే ఇక్కడి పాలకులపై ఫైర్ అయ్యారు. 30 కోట్ల 18 లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఇళ్లను నేలమట్టం చేసి భూమి చదును చేశారని, వేల మందికి నివాస యోగ్యమైన ఇళ్లను ఇలా పడగొట్టడం దారుణమైన చర్య అని ఖండించారు. రైతుల దగ్గర తక్కువ డబ్బుకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ లెక్కలు చూపి అంటగట్టారని, నాడు టిడ్కో ఇల్లు తీసుకోవద్దు, వైసిపి ప్రభుత్వం హయాంలోకి రాగానే రెండు సెంట్లు స్థలంలో ఇల్లు నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు తాళాలు అందజేస్తానని చెప్పిన ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట తప్పారని, నేడు నియోజకవర్గ ప్రజలను ఓట్లు వేయమని ఎలా అడుగుతారో చెప్పాలన్నారు.
Comments