ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం నాడు లూయిస్ బ్రెయిలీ జయంతిని తిరుపతి శివ జ్యోతి నగర్ గవర్నమెంట్ హోమ్ ఫర్ బ్లైండ్ ఆవరణలో AD శ్రీనివాసన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. . ముఖ్య అతిథులుగా SP వెంకటప్పల నాయుడు, మునిసిపల్ కమిషనర్ గిరీష IAS, నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్ ఫౌండర్ శ్రీధర్ఆచార్య, లోకా ఫౌండేషన్ ప్రతినిధి సునీల్ జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ చిన్న వయసులోనే ప్రమాదవశాత్తు కంటిచూపు పోయిన లూయిస్ బ్రెయిలీ సమాజంలో తనలాంటి చూపు లేని ప్రజలుకు తేలికగా రాయడంతో పాటు చదవడానికి వీలుండే లిపిని కనిపెట్టి అనేక మంది జీవితాలలో వెలుగులు నింపిన గొప్ప మానవతావాదని కొనియాడారు. ఈ విజ్ఞానం తో అంధత్వం ఉన్నవారు ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారని, అంధులును చిన్న చూపు చూడకూడదని వారి పట్ల మానవతా దృక్పథంతో మనలో కలుపుకొని పోవాలన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ నెల 29,30 తేదీలలో జరిగిన అంధుల క్రీడలలో గెలుపొందిన వారికి అతిధుల చేతులమీదుగా బహుమతులను ప్రదానం చేశారు తరువాత కేక్ కట్ చేసి గవర్నమెంట్ హోమ్ ఫర్ బ్లైండ్ పిల్లలు మరియు ప్రత్యేక ప్రతిభావంతుల పిల్లలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరికి AD శ్రీనివాసన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
top of page
bottom of page
Comments